దేశంలో ఇప్పుడు కరోనా కట్టడికి గానూ... ప్లాస్మా అనేది చాలా కీలకం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్లాస్మా చికిత్స ద్వారా చాలా మంది ప్రాణాలు నిలబడే అవకాశం ఉంది అని  ప్రభుత్వాలు చెప్తూ ప్లాస్మా బ్యాంకు ని కూడా మొదలు పెడుతున్నాయి. అయితే తాజాగా సిఆర్పీఎఫ్ జవాన్ లు ప్లాస్మా దానం చేయడానికి గానూ ముందుకు వచ్చారు. 

 

139 మంది జవాన్ లు కరోనా బారిన పడ్డారు అని ఇప్పటి వరకు ముగ్గురు ప్లాస్మా దానం చేసారు అని దీపేంద్ర రాజ్పుత్ అనే కమాండెంట్ మీడియాకు వివరించారు. కోలుకున్న సిబ్బంది అందరూ కరోనా రోగుల కోసం స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఇది దేశానికి సేవ చేయడానికి మరో మార్గం అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: