భారత్ చైనా మధ్య యుద్ధం వచ్చేస్తుందా...? ఏమో ఇప్పుడు భారత వాయిసేన చేస్తున్న వ్యాఖ్యలు, చేపడుతున్న చర్యలు చూస్తే అదే అనుమానం కలుగుతుంది. భారత వాయిసేన ఇప్పుడు భారీగా యుద్ద విమానాలను మొహరించడమే కాకుండా యుద్ద సామాగ్రిని  తీసుకుని వెళ్ళడానికి  గానూ  విమానాలను సిద్దం చేయడం  చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. 

 

అమెరికన్ సి-17 తో పాటు సి-130జె, రష్యాకు చెందిన ఇల్యూచిన్-76, ఆంటోనోవ్ -32 వంటి విమానాలను రవాణాకు వాడుతూ ఉంటారు. వాటిని ఇప్పుడు అక్కడ మోహరించింది. యుద్ధం వస్తే ఏ చర్యలు అయినా సరే వేగంగా తీసుకోవడానికి గానూ భారీ స్థాయిలో బలగాలను మొహరిస్తున్నామని సైన్యం చెప్పింది. ఫ్రంట్‌లైన్ జెట్లు, వైమానిక దాడిలో వినియోగించే యుద్ద విమానాలను కూడా భారీగా మొహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: