దేశంలో కరోనాతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే.. ఓ వైపు ఉగ్రవాదులు.. డ్రాగన్లు పదే పదే దాడులకు తెగబడుతున్నారు. గత ఏడాది పుల్వామ దాడి తర్వాత అదే తరహాలో పలుమార్లు దాడులు చేయడానికి ఉగ్రమూకలు ప్రయత్నాలు చేస్తున్నారు.  అయితే భారత సైన్యం ప్రతిసారి వారి ఎత్తులు చిత్తులు చేస్తూ షాక్ ఇస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు.

 

గంగూ ప్రాంతంలో ఈ ఉదయం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) కాన్వాయ్‌పై దాడికి దిగారు. సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఈఐడీని పేల్చారు. అయితే ఈ దాడిలో ప్రాణ నష్టం జరగలేదు.. కాకపోతే పలువురు జవాన్లకు గాయాలు అయ్యాయి.  అయితే ఉగ్రవాదులు దాడి చేయబోతున్నట్లు గా ముందుగానే భారత సైన్యం పసిగట్టింది.

 

దాంతో అప్రమత్తమైన బలగాలు వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులపై కాల్పులు ప్రారంభించాయి. ఈఐడీ పేల్చిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నట్టు సీఆర్‌పీఎఫ్ అధికారులు పేర్కొన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: