దేశ వ్యాప్తంగా కరోనా పరిక్షలు వేగంగా జరుగుతున్నాయి. కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నా సరే లాభం లేకపోవడంతో పరీక్షలను వేగంగా చేస్తుంది కేంద్రం. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా పరిక్షల విషయంలో దూకుడుగానే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే గత 24 గంటల్లో దాదాపు 2 లక్షల 50 వేల కరోనా పరిక్షలు చేసారు. 

 

జూలై 4 వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 97,89,066 అని ఐసిఎంఆర్ ప్రకటించింది.  వీటిలో 2,48,934 నమూనాలను నిన్న పరీక్షించారని పేర్కొంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్). కాగా దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 24 వేల కేసులు నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: