హైదరాబాద్ ల కరోనా కేసులు భయపెడుతున్నాయి. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా గా ఉన్న హైదరాబాద్ లో కరోనా కేసులు ఈ స్థాయిలో రావడం చూసి కేంద్రం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. వేల కేసులు రోజుల  వ్యవధిలో నమోదు అవుతూనే ఉన్నాయి.  హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంలో మురికివాడలు ఎక్కువగా ఉన్నాయి. 

 

దాదాపు మూసి నది పక్కన 10 మురికివాడలు ఉన్నాయి. అక్కడికి ఒకసారి కరోనా అడుగుపెడితే పరిస్థితి ఏంటీ అనే ఆందోళన మొదలయింది. అయితే ముంబై మురికివాడ ధారావిలో అనుసరించిన వ్యూహాన్నే అక్కడ కూడా అనుసరించారు. కరోనా వ్యాప్తిని తగ్గించడానికి గానూ ఆశా కార్మికులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడమే కాకుండా ఇంటి ఇంటికి తిరిగి సర్వే చేయడంతో ఓల్డ్ సిటీలోని 10 మురికివాడల్లో నివసిస్తున్న 1.5 లక్షల మందిలో 46 మందికి మాత్రమే కరోనా సోకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: