ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించే విషయంలో ఇప్పుడు ఆలస్యం కావడం కాస్త విమర్శలకు వేదికగా మారింది.  మండలిలో ప్రభుత్వ౦ ప్రవేశ పెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుని టీడీపీ అడ్డుకోవడంతో  జీతాలు ఆలస్యం అయ్యాయి అనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే గవర్నర్ నుంచి ఆమోదం పొందినా సరే జీతాలు మాత్రం జమ కాలేదు. 

 

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సోమవారం 

 

అమరావతి

 

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సోమవారం జమ కానున్నాయి. 

 

2వ తేదీనే గవర్నర్‌ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపినప్పటికీ శనివారం వరకు ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ కాలేదు. గవర్నర్‌ ఆమోదం పొందిన రోజే బడ్జెట్‌ అమల్లోకి వస్తున్నట్లు ఆర్థికశాఖ జీవో ఇచ్చినా సరే ఉద్యోగుల వేతన బిల్లులు జమ కాలేదు. ట్రెజరీ కంట్రోల్‌ లేని కొన్ని వేతన బిల్లులను బడ్జెట్‌తో అవసరం లేకుండా ఆర్థికశాఖ కార్యదర్శి విడుదల చేసే అవకాశం ఉన్నా సరే జీతాలు జమ కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: