ఆదివారం గురు పౌర్ణ‌మి కావ‌డంతో దేశ వ్యాప్తంగా ఎన్నో దేవాల‌యాలు క‌ళ‌క‌ళలాడాల్సి ఉంది. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న నేప‌థ్యంలో ఎక్క‌డా చూసినా దేవాల‌యాలు క‌ళ త‌ప్పి ఉన్నాయి. ప‌లు ప్ర‌ముఖ దేవాల‌యాలు ఈ రోజు భ‌క్తుల‌తో కిట కిట‌లాడి పోవాల్సి ఉండ‌గా ఎక్క‌గా సంద‌డి లేదు. ప్రముఖ సాయిబాబా ఆలయాల్లోనూ సందడి కనిపించడం లేదు.

 

షిరిడీలో ప్రధాన పూజారులు పలు సేవలను స్వామికి ఏకాంతంగా జరిపించి, పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. బాసరలో సరస్వతీ దేవి అమ్మవారికి ఈ వేకువజామునే పూజారులు ప్రత్యేక పూజలు జరిపించారు. నేడు జరగాల్సిన వేద పండితుల సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: