తగ్గింది ఇక లేదు అని భావించిన మిడతల దండు ప్రభావం మరోసారి భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి అని కేంద్ర వ్యవసాయ శాఖ హెచ్చరించింది. మిడతల దండు ప్రభావం ఆరు రాష్ట్రాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి అని పేర్కొంది. తాజాగా మిడతల దండు ప్రభావం రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఉండే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది. 

 

గాలి దక్షిణం వైపు వీస్తే మహారాష్ట్ర వైపు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా తెలంగాణకు కూడా ఈ ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కూడా మిడతలు కాస్త ఇబ్బంది పెట్టాయి. జైసల్మేర్, బార్మెర్, జోద్ పూర్, నాగౌర్, సికార్, జైపూర్, రాజస్ధాన్ లోని అల్వార్ లో మిడతలు ప్రభావం చూపించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: