మ‌న‌దేశంలో క‌రోనా రోగుల సంఖ్య రోజు రోజుకు విస్తృతంగా పెరిగిపోతోంది. ఈ క్ర‌మంలోనే దేశంలో కేసుల సంఖ్య ఏకంగా 6 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. ఇక దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన యూపీలో కూడా కేసులు రోజు రోజుకు విప‌రీతంగా పెరిగి పోతున్నాయి. ఏకంగా ఇద్ద‌రు కేబినెట్ మంత్రుల‌కే క‌రోనా సోకిందంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేల‌కు క‌రోనా రాగా, మ‌హారాష్ట్ర‌లోనూ న‌లుగురు ఎమ్మెల్యేల‌కు క‌రోనా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

 

ఇక ఇప్పుడు యూపీలో ఏకంగా ఇద్దరు సీనియర్‌ మంత్రులకు  కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి రాజేంద్ర ప్రతాప్‌ సింగ్‌తో పాటు ఆయన  భార్య, కొడుకు, కోడలు, మనవరాళ్లకు కరోనా సోకింది.  చికిత్స నిమిత్తం  మంత్రితో పాటు ఆయన కుటుంబసభ్యులు సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో  చేరారు.  ఇక ఇదే కేబినెట్లో మ‌రో మంత్రి అయిన ఆయూష్‌ శాఖ మంత్రి ధరమ్‌ సింగ్‌ సైనీ కూడా కరోనా బారినపడ్డారు.  దగ్గుతో బాధపడుతున్న ధరమ్‌సింగ్‌కు పరీక్ష చేయగా కోవిడ్‌-19  పాజిటివ్‌గా  తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: