ఈశాన్య రాష్ట్ర‌మైన అసోంను వ‌ర‌ద‌లు అత‌లాకుత‌లం చేశాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ద‌ల వ‌ల్ల మొత్తం 37 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో 18 జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. వీటిలో ప్రస్తుతం 7 జిల్లాల పరిస్థితి మెరుగుపడింది. ప్ర‌ధాని మోదీ స్వ‌యంగా రంగంలోకి దిగి మృతుల‌కు రు. 2 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా కూడా ప్ర‌క‌టించారు.

 

అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు స్పందిస్తూ... ధెమాజీ, బిశ్వనాథ్‌, చిరాంగ్‌, దరాంగ్‌, నల్బరి, బార్పేట, కొక్రాజార్‌, ధుబ్రీ, నాగావ్‌, గోలఘాట్‌, జోర్హాట్‌, దిబ్రుగర్‌, సౌత్‌ సాల్మోరా, గోల్పారా, కమ్రూప్‌, మమ్రోప్‌(మెట్రో), టిన్సుకియా జిల్లాలు తీవ్ర వరద ప్రభావానికి గురైనట్లు తెలిపారు. 1,412 గ్రామాల్లో సుమారు 11 లక్షల మంది ప్రజలు వరదల కారణంగా బాధలు ఎదుర్కొంటున్నారు. 53,348 హెక్టార్లలో పంట పొలాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: