దేశంలో ఇప్పుడు కరోనా కష్టాలు పడుతున్నారు ప్రజలు. ఎక్కడ చూసినా కరోనా పేరు చెబితే భయంతో వణికిపోతున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో ఓ వైపు జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.  ఈ రోజు కూడా పుల్వామా తరహా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మరోవైపు మావోలు కూడా కాల్పులకు తెగబడుతున్నారు. తాజాగా ఒడిశాలో భద్రతా బలగాలు,  మావోల మధ్య జరిగిన హోరాహోరీ ఎదురు కాల్పుల్లో నలుగు మావోయిస్టులు హతమయ్యారు.

 

కందమాల్ జిల్లాలోని సిర్ల అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.  కాల్పుల తర్వాత మావోలు అడవుల్లోకి పారిపోయారు.   ఆ తర్వాత భద్రతా బలగాలు చేపట్టిన నలుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అడవుల్లోకి పారిపోయిన మిగిలిన వారికి పోలీసులు గాలిస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: