పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే పోలీసు శాఖలో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఏలూరు పోలీస్ శాఖలో 18 మందికి ఒకేసారి కరోనా వచ్చింది అని వెల్లడి కావడంతో సర్వత్రా  ఆందోళన వ్యక్తమవుతుంది. 

 

ఏలూరు నగరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎనిమిది మందికి కరోనా వచ్చింది. ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిలో కరోనా కేసులు క్రమంగా బయటపడుతున్నాయి. వారిలో పది మందికి కరోనా సోకింది అని వెల్లడి అయింది. ఇక పోలీసు సిబ్బందికి కాంటాక్ట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అందరికి కరోనా పరిక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: