గాల్వాన్ లోయ‌లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితుల త‌ర్వాత భార‌త్‌తో ప్రారంభ‌మైనా షాకుల ప‌రంప‌ర‌లు చైనాకు కొన‌సాగుతూనే ఉన్నాయి. భారత్‌ నుంచి భారీ డిజిటల్‌ స్ట్రైక్స్‌ను చవిచూసిన చైనాకు దిగ్గజ మొబైల్‌ సంస్థ యాపిల్‌ ఊహించిన షాక్‌ ఇచ్చింది. భార‌త్ ఏకంగా చైనాకు చెందిన 59 యాప్స్‌పై నిషేధం విధించ‌డంతో చైనా కంపెనీలు ఏకంగా రు. 45 వేల కోట్లు న‌ష్ట‌పోయాయి. ఇది చైనా కంపెనీల‌కు పెద్ద న‌ష్టం కావ‌డంతో వారంతా తీవ్ర ఆందోళ‌న ‌చెందుతున్నారు. ఇక ఇప్పుడు ఈ షాక్ నుంచి కోలుకోకుండానే యాపిల్ చైనాకు మ‌రో అదిరిపోయే షాక్ ఇచ్చింది.

 

చైనీస్‌ యాప్‌ స్టోర్‌లోని 4500 మొబైల్‌ గేమ్స్‌ను తొలగించింది. గడిచిన మూడు రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో గేమ్స్‌ను తొలగించడంతో చైనా కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే వీటిల్లో చాలా వ‌ర‌కు లైసెన్స్ లేకుండా ఉన్నాయ‌ని.. ఈ క్ర‌మంలోనే ప‌లు సంస్క‌ర‌ణ‌ల నేప‌థ్యంలో వీటిని తొల‌గించినట్టు యాపిల్ చెప్పింది. అయితే ఇందులో ఏ గేమ్స్‌కు అయితే లైసెన్సులు పున‌రుద్ధ రించుకుంటారో వాటిని తిరిగి ప్లే స్టోర్‌లో ఉంచుతామ‌ని చెప్పింది. ఇక దీనిపై యేడాది క్రింద‌టే తాము సూచ‌న‌లు జారీ చేశామ‌ని కూడా యాపిల్ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: