క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌తో ప్ర‌పంచంలో పేరుమోసిన కంపెనీలు, సంస్థ‌లే మూత ప‌డిపోతున్నాయి. ఎన్నో ప్ర‌భుత్వ కార్యాల‌యాలు సైతం మూత‌ప‌డుతున్నాయి. అయితే క‌రోనా దెబ్బ‌తో ప్ర‌జ‌ల‌ను కంట్రోల్ చేస్తోన్న పోలీసులు సైతం ఎన్నో క‌ష్టాలు ప‌డుతున్నారు. ఇక ఏపీలో ఇప్పుడిప్పుడే క‌రోనా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే కరోనా దెబ్బకు నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలీస్ స్టేషన్‌ను మూసివేశారు. ఆ స్టేషన్‌లో పనిచేసే దాదాపు అందరికీ కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. 

 

జిల్లాలోని వెంక‌ట‌గిరి పోలీస్ స్టేష‌న్లో ప‌నిచేస్తోన్న మొత్తం 11 మంది పోలీసులు, సిబ్బందికి వైరస్ సోకింది. ఓ హత్య కేసులో నిందితుల ద్వారా కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. వెంకటగిరి సీఐతోపాటు, ఎస్ఐ, ఏడుగురు పోలీసులకు, హోంగార్డుకు కరోనా నిర్ధారణ అయింది. అలాగే స్వీపర్లకు వైరస్ సోకింది. దీంతో పోలీస్ స్టేషన్‌ను మూసివేసి వారందరినీ క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: