అస‌లే మ‌హారాష్ట్ర‌తో పాటు రాజ‌ధాని ముంబైను క‌రోనా క‌కావిక‌లం చేసేస్తోంది. దేశ వ్యాప్తంగా న‌మోదు అవుతోన్న కరోనా కేసులు, మ‌ర‌ణాల్లో మ‌హారాష్ట్ర‌లోనూ, ముంబైలోనే ఏకంగా పావు వంతుకు పైగా కేసులు న‌మోదు అవుతున్నాయి. అసలే క‌రోనా దెబ్బ‌తో ముంబై అత‌లా కుత‌లం అవుతుంటే ఇప్పుడు దీనికి తోడు భారీ వర్షాలు కూడా తోడ‌య్యాయి. దీంతో ముంబైలో లోత‌ట్టు ప్రాంతాలు అన్ని జ‌ల‌మ‌యం అయ్యాయి. నైరుతి రుతుపవనాలకు ఉపరితల ఆవర్తనాలు తోడవడంతో ముంబైలో భారీ వ‌ర్షాల‌కు కురుస్తున్నాయి. ఇది మ‌రో రెండు రోజుల వ‌ర‌కు కొన‌సాగే అవ‌కాశం ఉంది.

 

ముంబైలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొలాబా అబ్జర్వేటరీ, శాంతాక్రజ్ ప్రాంతాల్లో గడచిన 24 గంటల వ్యవధిలో కుండపోత వానలు కురిశాయి. రాగల 24 గంటల్లో ముంబయిలో కుంభవృష్టి తప్పదని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ వ‌ర్షాల‌కు తోడు క‌రోనా కూడా విజృంభించే ప్ర‌మాదం ఉంద‌ని కూడా చెపుతున్నారు. వ‌ర్షాకాలం సీజ‌న్లో క‌రోనా ప్ర‌మాదం మ‌రింత ఎక్కువుగా ఉంటుంద‌ని.. ఇది తీవ్ర‌మైతే ముంబై మ‌రింత ప్ర‌మాదంలో ప‌డిపోవ‌డం ఖాయ‌మ‌ని చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: