ఓ వైపు క‌రోనా వ్యాప్తి చేసిన నేప‌థ్యంలో ప్ర‌పంచంలో అగ్ర దేశాలు అన్ని చైనాపై తీవ్రంగా మండిపడుతున్నాయి. అగ్ర రాజ్యం అమెరికాతో పాటు ప‌లు పెద్ద దేశాలు ఇప్పుడు చైనాను ఎలా దెబ్బ కొట్టాలి ?  ఎలా ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని కాచుకుని ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే చైనా కు చెందిన 59 యాప్‌ల‌ను భార‌త్ నిషేధించ‌గా.. అమెరికా కూడా చైనాపై ప‌లు తీవ్ర‌మైన ఆంక్ష‌లు విధించింది. ఇక ఇప్పుడు చైనాకు బ్రిట‌న్ కూడా బిగ్ షాక్ ఇవ్వ‌నుంది. త‌మ దేశంలో 5జీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న చైనా కంపెనీ హువావేకు చెక్ పెట్టాలనే నిర్ణయానికి బ్రిట‌న్ వచ్చింది. 

 

ఇప్పటివరకూ అమర్చిన హువావే కంపెనీ పరికరాలను తొలగించడంతో పాటూ మరో ఆరు నెలల్లో బ్రిటన్‌లో పూర్తిగా ఆ కంపెనీ సేవలను నిలిపివేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. చైనా టెక్నాల‌జీ వ‌ల్ల ఎప్ప‌ట‌కి అయినా త‌మ‌కు ముప్పు పొంచి ఉంద‌న్న అనుమానాల నేప‌థ్యంలో బ్రిట‌న్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ కొత్త టెక్నాలజీని బ్రిటన్‌లో వినియోగిస్తే అది దేశ భద్రతకు పెద్ద ముప్పని సైబర్ సెక్యూరిటీ సెంటర్ భావిస్తోంది. ఈ వివరాలతో కూడిన ఓ సవివరమైన నివేదికను త్వరలో బ్రిటన్ ప్రధానికి సమర్పించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: