భారత దేశంలో బెంగాల్ టైగర్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే.  మాస్ మహరాజ ఈ మూవీ పేరుతో ఓ చిత్రంలో కూడా నటించారు.  బెంగాల్ టైగర్ అంటే పులుల్లో అత్యంత శ్రేష్టమైనది.. గొప్పదైనది అని అంటారు.  హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్‌ పార్కులో రాయల్ బెంగాల్ టైగర్ కదంబ శనివారం రాత్రి మృతిచెందింది. అయితే 11 సంవత్సరాల వయసున్న ఈ మగపులికి ఎలాంటి అరోగ్య సమస్యలు కనిపించలేదని.. కానీ కొన్ని రోజులుగా  ఆహారం ముట్టకుండా ఉంటున్నదని జూ అధికారి ఒకరు తెలిపారు.  

 

ఈ మేరకు కదంబకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. దాని మృతికి గల కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి వరకు పది రోజుల వ్యవధిలో రెండు పులులు చనిపోయాయి. జూన్ 25న కిరణ్ అనే 8 ఏళ్ల వయసున్న మగ తెల్లపులి నియోప్లాస్టిక్ కణితి కారణంగా మరణించిందని వెల్లడించారు.

 

రాజేంద్రనగర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, పాథాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ లక్ష్మణ్ నేతృత్వంలోని నిపుణుల బృందం ఆదివారం కదంబ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. కదంబ మరణంతో హైదరాబాద్‌ జూపార్కులో 8 పెద్దవి, 3 పిల్లలతో మొత్తం 11 రాయల్ బెంగాల్ టైగర్స్ (పసుపు), 9 రాయల్ బెంగాల్ టైగర్స్ (తెలుపు) పెద్దవి ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: