జపాన్​లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 100 మిల్లీమీటర్ల మేర కురిసిన వర్షం వల్ల పట్టణాలు, నగరాలు జలమయం అయ్యాయి. దక్షిణ జపాన్ కుమామోటో ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి సుమారు 20 మంది మరణించారు.

 

సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ప్రస్తుతం కుమామోటో ప్రాంతంలో రెస్క్యూ హెలికాప్టర్లు, 10 వేల మంది రక్షణ దళ సిబ్బంది, కోస్ట్​గార్డ్, అగ్నిమాపక దళాలు యుద్ధప్రాతిపదిన సహాయ చర్యలు చేపడుతున్నాయి.

 

కుమా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. తీరప్రాంతాల్లోని ఇళ్లు, భవనాలు నీటమునిగాయి. ప్రజలు ఇళ్ల పైకప్పుల మీదకు వచ్చి, సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.కుమాలోని ఓ వృద్ధాశ్రమం వరదనీటిలో చిక్కుకుపోయింది. ఫలితంగా ఆశ్రమంలోని 14 మంది వృద్ధులు మరణించారని అధికారులు అనుమానిస్తున్నారు.సెంజుయెన్ ప్రాంతంలో సుమారు 60 మంది స్థానికులు వరదల్లో చిక్కుకున్నారు. వీరు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: