తాను తెరకెక్కిస్తున్న 'పవర్​స్టార్'​ సినిమా ఏ వ్యక్తికో చెందిన బయోపిక్​ కాదని స్పష్టం చేశారు దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ. ఈ కథ ఎవరి జీవితాన్నైనా పోలిఉంటే అది కేవలం యాదృచ్ఛికం అని తెలిపారు.

వివాదస్పద దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ 'పవర్​స్టార్'​ పేరుతో ఓ సినిమాను తీయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను ట్వీట్ చేశారు. అయితే ఇది పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ బయోపిక్ అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై స్పందించారు వర్మ.

ఇటీవల మిర్యాలగూడ ప్రణయ్​ హత్యోదంతం ఆధారంగా 'మర్డర్' అనే​ సినిమా తీస్తున్నట్లు వర్మ ప్రకటించారు. దీనిపై కేసు కూడా నమోదైంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: