భారత్​లో వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్న సిఖ్స్ ఫర్ జస్టిస్​(ఎస్​ఎఫ్​జే)కు చెందిన 40 వెబ్​సైట్లను నిషేధించినట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. అమెరికాకు చెందిన ఎస్​ఎఫ్​జే ఖలిస్థాన్ ఉగ్రవాదులకు అనుకూలంగా పనిచేస్తూ.. వారిని ప్రోత్సహిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ గత ఏడాదే ఎస్​ఎఫ్​జే ను హోం శాఖ నిషేధించింది.

 తాజాగా దానితో సంబంధం ఉన్న వెబ్​సైట్లను సైతం ఈ జాబితాలోకు చేరుస్తూ ఎలక్ర్టానిక్స్ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్​ఎఫ్​జే బాహాటంగా ఖలిస్థాన్​కు మద్దతు ఇస్తోందని, ఫలితంగా దేశ సమగ్రత, సార్వభౌమత్వం, భౌగోళిక స్వరూపాలకు సవాళ్లు ఎదురవుతాయని హోం శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వేర్పాటువాద అజెండాతో ముందుకొచ్చిన ఎస్​ఎఫ్​జే.. సిక్కుల కోసం ప్రత్యేకంగా ఖలిస్థాన్​ సామ్రాజ్యాన్ని సాధించేందుకు ఉగ్రవాద చర్యలకు సహకరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: