కరోనా కేసుల్లో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో అమెరికా ఉంది . రోజురోజుకు అక్కడ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. 99 శాతం వైరస్​ కేసులు ప్రమాదరకమైనవి కాదన్నారు. ట్రంప్​ వ్యాఖ్యలపై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) కమిషనర్ డా. స్టీఫెన్​ హాన్​​ మండిపడ్డారు. వైరస్​ ఎంత హానికరమో ప్రభుత్వ వివరాలే రుజువు చేస్తున్నాయన్నారు.

 

'ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అని తెలుసుకోవడం లేదు. కరోనా ఎంత తీవ్రమైన సమస్య అని ప్రభుత్వ డేటాయే రుజువు చేస్తోంది. ఏదేమైనా ఈ పరిస్థితి విషాదకరమైంది. పెరుగుతున్న కేసులను తగ్గించాలంటే ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రజలు తప్పక పాటించాలి. మాస్క్​లు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి.' అని డాక్టర్​ స్టీఫెన్​ హాన్​ తెలిపారు.

 

అమెరికా ఎక్కువ పరీక్షలు చేస్తోంది. అందువల్ల అధిక సంఖ్యలో వైరస్​ కేసులు బయటపడుతున్నాయి. అయితే ఇందులో 99శాతం ప్రమాదకరమైనవి కావు.' అని ట్రంప్​ ఇటీవలే వ్యాఖ్యానించారు.ట్రంప్​ మాటలను ఖండించారు టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్​ మేయర్​ స్టీవ్ అడ్లెర్. ట్రంప్​ వ్యాఖ్యలే చాలా ప్రమాదకరమైనవని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: