మహారాష్ట్రలో గత పది రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక దీనితో మహారాష్ట్రలో విస్తారంగా ఉండే ఉల్లి పంట భారీగా దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అక్కడ ఉల్లి పంట మనకు ఎక్కువగా వస్తుంది. హైదరాబాద్ మార్కెట్ కి దాదాపు ప్రతీ రోజు 200 లారీల వరకు వస్తు ఉంటాయి. 

 

ఇప్పుడు అది తగ్గే అవకాశం ఉంది అని అంటున్నారు. ధరలు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి అని తెలుస్తుంది. ఇప్పుడు పది కేజీలు 200 లోపే ఉండగా అది 400 వరకు వెళ్ళే అవకాశం ఉంది అని వ్యాపారస్తులు అంచనా వేస్తున్నారు.  ముంబై సరిహద్దు జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: