గల్ఫ్ దేశాల్లో భారత్ నుంచి ఎక్కువగా వెళ్ళేది కువైట్ కి. అక్కడ పనులు వెతుక్కుంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కేరళ నుంచి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఈ తరుణంలో కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులను తగ్గించే దిశగా అడుగులు వేస్తుంది. కువైట్ లో ఉండే భారతీయుల సంఖ్య 1.4 మిలియన్లు గా ఉంది. 

 

ఇప్పుడు ఆ సంఖ్యను 15 శాతం వరకు తగ్గిస్తుంది. ఇక ఆ దేశంలో 4.8 మిలియన్ల జనాభా ప్రవాసులే ఉన్నారు. దీనితో వారి సంఖ్యను తగ్గించడానికి గానూ ఒక ముసాయిదా బిల్లుని అక్కడి సర్కార్ ఆమోదించింది. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద పడే అవకాశం ఉంది. భారీగా అక్కడి నుంచి తెలుగు వారు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: