భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంది అనే వార్తలు వచ్చాయి. 20 వేల మంది సైనికులను పాకిస్తాన్ మొహరించే సూచనలు ఉన్నాయి అనే ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. సాధారణంగా సరిహద్దు దేశాల మధ్య వివాదాలు ఉన్న సమయంలో సైన్యాన్ని మోహరించడం సహజం అని పేర్కొన్నారు. 

 

అలాంటి చర్యలు ఏమీ పాకిస్తాన్ నుంచి కనపడలేదు గాని ఆయుధ సామాగ్రిని మాత్రం ఎక్కువగా మోహరించింది అని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. పాకిస్తాన్ సరిహద్దుల నుంచి పంపడానికి గానూ 300 మంది ఉగ్రవాదులను సిద్దంగా ఉంచింది అని సదరు అధికారి పేర్కొన్నారు. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు అని ఆర్మీ ఏ చర్యకు అయినా సిద్దంగా ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: