దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఏడు లక్షల దిశగా కరోనా కేసులు వెళ్తున్నాయి. ప్రతీ రోజు కూడా 23 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి గాని ఏ మాత్రం కూడా ఆగడం లేదు. ప్రభుత్వాల చర్యలు ఫలించడం లేదు. లాక్ డౌన్  మినహాయింపుల తర్వాత కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా పరిక్షలు కూడా కోటి పరిక్షలకు చేరువలో ఉన్నాయి. జూలై 5 వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 99,69,662 అని ఐసిఎంఆర్ వెల్లడించింది. వీటిలో 1,80,596 నమూనాలను నిన్న పరీక్షించారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) పేర్కొంది. ఏపీలో రికార్డ్ స్థాయిలో 10 లక్షల పరిక్షలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: