దేశంలో కరోనా పేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా కరోనాని కట్టడి మాత్రం చేయలేకపోతున్నాం. దేశంలో కరోనా కరాళనృత్యం ఏ మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఓ వైపు కోలుకున్న వారు పెరుగుతున్నా.. మరోవైపు కొత్తగా వ్యాధిబారిన పడుతున్న వారు ఎక్కువగానే ఉన్నారు.  గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆదివారం భారత్‌లో 24,248 మందికి కొత్తగా వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి.425 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

ఇదిలా ఉంటే ఈ మద్య కొంత మంది కరోనా విషయంలో నిర్లక్ష్య దోరణి వహిస్తున్నారు. కళ్యాణదుర్గంలో కరోనా వచ్చిన వారిని అధికారులు నిర్లక్ష్యంగా రోడ్డుపై ఎలా ఉంచుతారని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెళుగుప్ప మండలం బ్రాహ్మణపల్లికి చెందిన యువతిని అధికారులు కళ్యాణదుర్గంకి రమ్మనడంతో యువతి వచ్చిందన్నారు.

 

ఆ యువతిని ఇంతవరకు కోవిడ్ సెంటర్ కు తరలించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కళ్యాణదుర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగుళూరు నుంచి వారం రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన యువతికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కరోనా రోగుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: