హైదరాబాద్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ప్రజలు ముందుకు వస్తున్నా కరోనా ఆగడం లేదు. ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలో ఇప్పుడు కరోనా కేసుల విషయంలో వైద్యం కొరత ఎక్కువగా ఉంటుంది. వైద్యం అందే పరిస్థితి లేక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. 

 

ఇదిలా ఉంటే హైదరాబాద్ ఆస్పత్రుల్లో ఇప్పుడు నర్సుల కోరత చాలా ఎక్కువగా ఉంది. అక్కడ కరోనా ఎప్పుడు అయితే బయటపడిందో అప్పుడే చాలా మంది నర్సులు ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోయారు. గాంధీ ఆస్పత్రి సహా పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇప్పుడు నర్సుల కొరత ఎక్కువగా ఉంది అనే వార్తలు వస్తున్నాయి. దీనితో ఇప్పుడు ప్రభుత్వం చాలా వరకు నర్సుల విషయంలో అప్రమత్తం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: