దేశంలో మొన్నటి వరకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయని లాక్ డౌన్ పాటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అన్ని వ్యవస్థలు మూసి వేశారు. ముఖ్యంగా రవాణా వ్యవస్థ బంద్ చేయడంతో రోడ్డు ప్రమాదం సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. క్రేమ్ రేటు కూడా బాగా తగ్గిపోయింది. ఈ మద్య లాక్ డౌన్ సడలించిన తర్వాత మళ్లీ షరా మామూలుగానే రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్నాయి.

 

తాజాగా  పలమనేరు జాతీయ రహదారి జగమర్ల మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్​ను వెనుక నుంచి బొలెరో వాహనం ఢికొట్టింది. బంగారుపాళ్యం మండలం టేకుమంద గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చిన్నబ్బ(30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బొలెరో డ్రైవర్ పరారైయ్యాడు. పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: