ప్ర‌పంచ వ్యాప్తంగా నిమిషం నిమిషానికి స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌న దేశంలో కూడా ప‌లు రాష్ట్రాల్లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే రాజస్థాన్‌లో తాజాగా న‌మోదైన రికార్డు అందరినీ షాక్‌కు గురిచేసింది. రాజస్థాన్‌లో ఇప్పటివరకు అత్యధికంగా ఒక్క‌రోజులో ఏకంగా 632 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు అయిన కేసు ల సంఖ్య 20 వేలు క్రాస్ అయిన‌ట్లు అయ్యింది. ఈ కేసుల‌తో అక్క‌డ ప్ర‌భుత్వ‌, అధికారులు షాక్‌లో ఉన్నారు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా క‌రోనా క‌ట్ట‌డి మాత్రం ఆగ‌డం లేదు.

 

ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర దేశంలోనే అత్య‌ధికంగా క‌రోనా కేసుల‌తో టాప్ ప్లేసులో ఉంది. మ‌హారాష్ట్ర‌లో వ‌ల‌స కార్మికుల‌తోనే ఎక్కువుగా క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇక ఇప్పుడు రాజస్థాన్‌లో వలస కార్మికుల కార‌ణంగా క‌రోనా వ్యాప్తి చెందుతున్న‌ద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌లో ఇప్పటివరకు 15,928 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 80 శాతానికి పైగా ఉంద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. యాక్టివ్ కేసు సంఖ్య 3780గా ఉండ‌గా, మృతుల‌ సంఖ్య 500కు చేరువ‌లో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: