కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే భారత్ లో తొలి కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్‌కు కర్ణాటకలో తొలి హ్యూమన్ ట్రయల్ నిర్వహిస్తున్నారు. బెలగావిలో 200 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై ఈ  వ్యాక్సిన్ ని పరీక్షించే అవకాశం ఉంది. 

 

హైదరాబాద్ జినోమ్ వ్యాలీ కేంద్రంగా పని చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థతో పాటుగా దేశంలోని ప్ర‌ముఖ‌ వైద్యులు సంయుక్తంగా దీని ట్రయల్స్ నిర్వహిస్తారు అని  తెలుస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) పర్యవేక్షణలో ఈ ట్రయల్స్ ని నిర్వహిస్తారు. ఇక రేపు నిమ్స్ లో కూడా దీనిపై పరిక్షలు జరుగుతున్నాయి. ఇది ఆగస్ట్ 15 న దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశ౦ ఉందని భారత్ బయోటెక్ పేర్కొంది

మరింత సమాచారం తెలుసుకోండి: