దేశంలో కరోనా రోగుల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. ప్ర‌తి సెక‌నుకు కేసుల సంఖ్య విప‌రీతంగా పెరిగిపోతూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే గ‌త 24 గంట‌ల్లో మ‌న దేశంలో క‌రోనా లెక్క‌ల‌ను ప‌రిశీలిస్తే మొత్తం 24, 248 కొత్త కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 425 మంది మృతి చెందారు. ఇక నిన్న‌టి వ‌ర‌కు రోజుకు 20 వేల స‌రాస‌రీన కొత్త కేసులు న‌మోదు కాగా... అది ఈ రోజు నుంచి ఏకంగా 25 వేల‌కు చేరువ అవుతోంది. దీనిని బ‌ట్టి దేశంలో క‌రోనా మ‌రింత ప్ర‌మాద‌క‌ర స్థితికి చేరుకుంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

 

తాజా లెక్క‌ల‌తో దేశంలో మొత్తం క‌రోనా రోగుల సంఖ్య  6 , 97, 413కు చేరుకుంది. ఇక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపిన‌ ప్రకారం జూలై 5 వరకు మొత్తం 99 లక్షల 69 వేల 662 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. కాగా క‌రోనా కేసుల విష‌యంలో భారత్ రష్యాను దాటింది. ఇక రేపో మాపో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌ను దాటేసి రెండో స్థానంలోకి వెళ్లిపోనుంది. మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య‌ 2 లక్షలు దాటింది. మ‌హారాష్ట్ర దేశంలోనే అగ్ర‌స్థానంలో ఉన్న సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: