ప్రభుత్వం విఫలం అంటే వైద్యులను అవమానించడమేనని తెలంగాణా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... కరోనా విషయంలో ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు  పలికారు. కరోనా విషయంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

 

ప్రభుత్వం, ప్రభుత్వ సిబ్బంది వేరుకాదని ఆయన వ్యాఖ్యానించారు.  ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన వాళ్లే ఇలా మాట్లాడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజా ప్రతినిధులకు కరోనా వస్తుందంటే వారు నిరంతరం జనాల్లో ఉంటున్నారని... అందుకే ఎమ్మెల్యేలకు కరోనా వస్తోందని ఆయన ఆరోపించారు. కరోనా వస్తుందని తామే భయపడితే ఇక ప్రజలకు ధైర్యం చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు ఎక్కడ మీటింగులు పెట్టినా జనాలు, విలేకరులు గుంపులు గుంపులుగా వస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: