నిజామాబాద్ జిల్లాలో కరోనా కారణంగా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు ప్రకటన చేసే అవకాశం ఉంది. కరోనా లాక్‌‌డౌన్ కారణంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికను ఎన్నికల సంఘం గతంలో రెండు సార్లు వాయిదా వేసింది. ఈ ఎన్నికలో తెరాస నుంచి మాజీ ఎంపీ కవిత పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. 

 

ఈ నేపధ్యంలోనే నేటితో వాయిదా గడువు 45 రోజుల దాటింది. దీనితోనే నేడు ఎన్నికల సంఘం దీనిపై ప్రకటన చేయవచ్చు అని భావిస్తున్నారు. ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కవిత గెలుపు దాదాపు లాంచనం అని తెరాస ధీమా వ్యక్తం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: