భారత్ లో కరోనా పరిక్షలు చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రతీ రోజు కూడా రెండు లక్షలకు పైగా కరోనా టెస్ట్ లు జరుగుతున్నాయి. మొన్న ఒక్క రోజే ఏకంగా 2 లక్షల 50 వేలకు పైగా కరోనా పరీక్షలను రాష్ట్రాలు నిర్వహించాయి. ఇక ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా కరోనా పరిక్షలు  ఏకంగా కోటి మార్క్ దాటాయి. 

 

భారతదేశంలో పరీక్షలు 1 కోట్ల (10 మిలియన్) మార్కును దాటాయని ఐసిఎంఆర్ ప్రకటించింది. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు నిర్వహించిన 1,00,04,101 పరీక్షలు అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) అధికారి వెల్లడించారు. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో 10 లక్షల పరిక్షలు... అంటే దేశంలో పది శాతం ఎపీలోనే జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: