భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితి క్రమంగా మారుతుంది. చైనా సైన్యం క్రమంగా వెనక్కు తగ్గుతుంది అని భారత ఆర్మీ వెల్లడించింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ లడఖ్ పర్యటన తర్వాత పరిస్థితి మారింది. లడఖ్ లో వివాదాస్పాద ప్రాంతం నుంచి చైనా ఆర్మీ క్రమంగా వెనక్కు తగ్గింది. దీనితో టెంట్ లు అదే విధంగా వాహనాలను తొలగించారు. 

 

కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలలో అంగీకరించిన ప్రదేశాల నుండి చైనా సైన్యం గుడారాలు, వాహనాలు మరియు దళాలను 1-2 కిలోమీటర్ల దూరం వెనక్కి తరలించిందని ఇండియన్ ఆర్మీ పేర్కొంది. రాబోయే రెండు మూడు రోజుల్లో పూర్తిగా చైనా వెనక్కు తగ్గే అవకాశం ఉందని వెల్లడించాయి భారత ప్రభుత్వ వర్గాలు. ఇటీవల గాల్వాన్ లోయ వద్ద జరిగిన దాడిలో 23 మంది మరణించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: