కరోనా కష్ట కాలంలో పేదలు పడుతున్న ఇబ్బందుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కరోనా కట్టడికి చర్యలు తీసుకునే ప్రభుత్వాలు పేదలను పూర్తి స్థాయిలో ఆదుకునే పరిస్థితిలో లేవు. ఇక అందుకే వారి కరెంట్ బిల్లులను ప్రభుత్వమే భరించాలి అని తెలంగాణా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. తెల్ల రేషన్ కార్డుదారుల కరెంట్ బిల్లు ప్రభుత్వమే భరించాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి డిమాండ్ చేసారు. 

 

అదే విధంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల విద్యుత్ బిల్లులు కూడా మాఫీ చేయాలని ఆయన కోరారు. లాక్‌డౌన్ వల్ల పేదలకు ఆదాయం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలోని మూడు నెలల బిల్లులు ఒకేసారి తీశారని ఆయన ఆరోపించారు. దాని వల్ల తక్కువ టారిఫ్ పరిధిలోని వినియోగ దారులు ఎక్కువ టారిఫ్‌లోకి మారారని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: