దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో  లక్షకు పైగా కరోనా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీ లో కరోనా కేసులు లక్ష దాటినా సరే కోలుకున్న వారి సంఖ్య 72 వేలకు పైగా ఉందని ఆయన అన్నారు. 

 

యాక్టివ్ కేసులు ఉన్న 25 వేల మందిలో 15 వేల మంది ఇంట్లోనే కరోనా చికిత్స తీసుకుంటున్నారు అని ఆయన వివరించారు. దేశంలో మొదటి సారి తాము ప్లాస్మా బ్యాంక్ ని ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చర్యలు వేగంగా తీసుకుంటున్నాము అని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: