ఏపీలో ఇప్పుడు పోలీసులకు  ఇప్పుడు కరోనా వస్తున్న నేపధ్యంలో ఏపీ సర్కార్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రతీ ఏడు రోజులకు ఒకసారి ప్రతీ స్టేషన్ లో కరోనా పరిక్షలు చేసే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. అదే విధంగా మహారాష్ట్ర  తరహాలోనే ఏపీలో కూడా పోలీసులను 55 ఏళ్ళు దాటిన వారిని విధులకు రావొద్దు అని చెప్పే అవకాశం ఉంది. ఏపీలో నిన్న నెల్లూరు జిల్లాలోని వెంక‌ట‌గిరి పోలీస్ స్టేష‌న్ అంతా క‌రోనా దెబ్బ‌తో మూసివేశారు.

 

ఇక ఈ రోజు విశాఖ‌లోని ద్వార‌కా పోలీస్ స్టేష‌న్లోనూ ఆరుగురు పోలీసుల‌కు క‌రోనా సోకింది. మహారాష్ట్రలో అదే నిర్ణయం తీసుకున్నాక కాస్త పోలీసుల్లో కరోనా తగ్గింది. ఇప్పుడు ఏపీలో కూడా ఆ నిర్ణయం తీసుకోవాలి అని హోం శాఖ భావిస్తోంది. కరోనా దెబ్బకు ఇప్పుడు ప్రజలు అల్లాడుతున్నారు, పోలీసులు కూడా కరోనా దెబ్బకు భయపడితే ఇప్పుడు ప్రజలను కట్టడి చేసే వారు ఉండరు. అందుకే ఏపీ సర్కార్ ముందస్తు చర్యలు చేపట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: