ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతాల్లో ఇంకా కరోనా వైరస్ అడుగు పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలంగాణాలో కూడా అటవీ ప్రాంతాల్లో కరోనా వైరస్ అడుగు పెట్టలేదు. ఓ వైపు క‌రోనా వైర‌స్‌తో మైదాన ప్రాంతాలు, మెట్ట ప్రాంతాలు, డెల్టా ప్రాంతాలు అతలా కుత‌లం అవుతున్నాయి. అయితే అనూహ్యంగా ఆదివాసి గిరజనులను కరోనా మహమ్మారి ఇంకా టచ్ చేయలేదు. వారు ఎవరిని అసలు తమ గిరిజన  ప్రాంతాల్లోకి రానీయడం లేదు. వారు అడవి పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 

 

అసలు ప్రభుత్వ అధికారులు వస్తున్నా సరే వారిని కూడా రానీయడం లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని వారు కరోనా నుంచి బయటపడుతున్నారు. మహారాష్ట్ర సరిహద్దుని వందల కిలోమీటర్లు పంచుకునే అదిలాబాద్ జిల్లాలో కరోనా అడుగు పెట్టలేదు. తమ గిరిజన గ్రామాల్లోకి ఎవరిని అడుగు పెట్టనీయకపోవడమే  కరోనా నుంచి వారు బయట పడటానికి ప్రధాన కారణం అని ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇటు ఏపీ ఏజెన్సీలోరి రంప‌చోడ‌వ‌రం, విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీల్లో కూడా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా అడుగు పెట్ట‌డ‌క‌పోవ‌డం విశేషంగానే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: