భారత్ లో కరోనా వ్యాక్సిన్ విషయంలో ముందుకు అడుగు పడింది అని భావిస్తున్నా అసలు తేదీ ప్రకటించి కరోనా వ్యాక్సిన్ ని విడుదల చేయడం అనేది సాధ్యమా ? అనే దానిపై ప్రపంచ దేశాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగు లేదా 5 దశల్లో కరోనా వ్యాక్సిన్ పై ట్రయల్స్ ఉంటాయి. మానవుల మీద జంతువుల మీద అనేక రకాల పరీక్షలు చెయ్యాల్సి ఉంటుంది.

 

ఇప్పుడు దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఐసిఎంఆర్ అంత గుడ్డిగా ఏ విధంగా ప్రకటన చేసింది అంటూ  పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్రపంచంలో వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి సాధించిన ఇటలీ సహా కొన్ని దేశాలు కూడా ఈ వ్యాక్సిన్ కోసం నానా కష్టాలు పడుతున్నాయి. ఐసిఎంఆర్ అనవసరంగా అభాసుపాలు అయింది అనే విమర్శలు వస్తున్నాయి. మ‌రి క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలో ఇక‌నైనా సీరియ‌స్ ప్ర‌క‌ట‌న‌ వ‌స్తుందేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: