న్యాయవాదుల సమస్యలు పరిష్కారించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో న్యాయవాదులు సోమవారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా గతంలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లాయర్లు డిమాండ్ చేస్తున్నారు.  లాక్ డౌన్ నేపథ్యంలో ఎంతోమంది లాయర్లు ఇబ్బందులు పడ్డారని.. తమ సమస్యలను ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

ఈ సందర్భంగా  ఈ సందర్భంగా భారత న్యాయవాదులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ... ప్రభుత్వం గత సంవత్సరం ప్రభుత్వ బడ్జెట్‌లో న్యాయవాదుల సంక్షేమం కొరకు కేటాయించిన వంద కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

 

మరణించిన న్యాయవాదుల వారసులకి ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ నాలుగు లక్షల రూపాయలు తక్షణమే ఇవ్వాలని ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు. గత మూడు నెలల నుంచి జూనియర్ న్యాయవాదులకు బకాయిపడిన స్టైఫండ్‌ను తక్షణమే ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: