దేశంలో వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫీజులు అందరికీ అందుబాటులో ఉండాలని, పరీక్షా ఫలితాల్లో పారదర్శకత ఉండాలనే ఆదేశాలతో ల్యాబ్‌లకు ప్రభుత్వాలు నిబంధనలు విధించాయి. కానీ ప్రైవేట్ ల్యాబ్ లు నిబంధనలకు పాతర వేస్తూ వేలకు వేలు డబ్బులు దోచుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లో ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. 
 
కరోనా సోకిన వ్యక్తి 2,500 రూపాయలు ఇస్తే కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఇస్తోంది. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ ల్యాబ్‌ లైసెన్స్‌ను రద్దు చేయడంతో పాటు కేసు నమోదు చేశారు. విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమని జిల్లా మేజిస్ట్రేట్‌ అనిల్ దింగ్రా ఈ ఘటనపై వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: