తెలుగు రాష్ట్రాల్లో ఈ మద్య వరుసగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. తాజాగా 1590 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 23,902కి పెరిగింది. రాష్ట్రంలో మరో ఏడుగురు మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 295కి పెరిగింది. కాస్త ఊరటనిచ్చేలా ఇవాళ 1,166 మంది డిశ్చార్జి అయ్యారు. దాంతో మొత్తం 12,703 మంది కోలుకున్నట్టయింది. తాజాగా నగరంలోని ఎర్రగడ్డ రైతు బజార్లో కరోనా వైరస్ కలకలం సృష్టించింది.

 

ఎర్రగడ్డ రైతు బజారులోని ఓ కాంట్రాక్టర్‌ కరోనా వైరస్‌తో మృతి చెందారు. దీంతో మూడు రోజుల పాటు ఎర్రగడ్డ రైతు బజార్‌ను మూసివేస్తున్నారు అధికారులు.  కాంట్రాక్టర్‌ కాంటాక్ట్ అయిన వ్యక్తులను హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు. కాగా ఎర్రగడ్డ రైతు బజార్‌లో కరోనా కలకలంతో.. మార్కెట్‌కు వెళ్లినవారంతా ఇప్పుడు టెన్షన్ లో ఉన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: