ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పాఠశాలల నిర్వహణలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 13వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు వారానికి ఒకరోజు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు వారానికి రెండ్రోజులు పనిచేసేలా పాఠశాల విద్యా శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉపాధ్యాయులు పాఠశాలల్లో బ్రిడ్జి కోర్సులను రూపొందించాలని ప్రభుత్వం సూచనలు చేసింది. 
 
అన్ని స్కూళ్లలో ఈ నెలాఖరుకు నాడు నేడు పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీర్ఘకాలిక వ్యాధులు, కంటిచూపులో లోపాలు , దివ్యాంగులైన ఉపాధ్యాయులకు విధుల నుంచి మినహాయింపులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. బ్రిడ్జి కోర్సు ద్వారా ఇచ్చిన మెటీరియల్ ను విద్యార్థులు ఫాలో అవుతున్నారో లేదో ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని ప్రభుత్వం సూచించింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: