చైనా భారత్ దేశాల మధ్య గత రెండు నెలల నుంచి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత ఆర్మీ అధికారి లెఫ్టినెంట్‌ జనరల్‌ బీఎస్‌ రాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో పాక్‌ కవ్వింపు చర్యలకు పాల్పడే దుస్సాహసానికి పూనుకుంటుందని అనుకోవడం లేదని చెప్పారు. తూర్పు లడఖ్ లోని పరిస్థితులను అనుకూలంగా మలచుకుని ని జమ్మూ కశ్మీర్‌లోకి పాక్‌ ఉగ్రవాదులను పంపేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 
 
సరిహద్దుల వెంబడి పాక్‌ సైన్యం కదలికల్లో పెద్దగా మార్పులు కనిపించలేదని.... వాళ్లకు ధీటుగా జవాబిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని... పాక్‌ నుంచి భారీ సంఖ్యలో ఉగ్రవాదులు భారత్‌లో ప్రవేశించే అవకాశం ఉందని... వాళ్లను పట్టుకునేందుకు సర్వం సిద్ధం చేశామని వ్యాఖ్యలు చేశారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ దుస్సాహసానికి పాల్పడకుండా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: