ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్ట్‌ అయిన మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు  బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరుపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే బెయిల్‌ కోసం అచ్చెన్నాయుడు సహా నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్లను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి ఎం. వెంకటరమణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.  తాజాగా మరోసారి ఆయన తరుపు న్యాయవాదులు  హైకోర్టులో పిటిషన్ వేశారు.

 

ఈఎస్ఐ అవినీతి ఆరోపణల కేసులో అరెస్ట్ అయి విజయవాడ జిల్లా జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఏసీబీ కస్టడీ కూడా పూర్తవడంతో వెంటనే బెయిల్ ఇవ్వాలని ఆ పిటిషన్‌లో అభ్యర్థించారు.  విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించటంతో అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాదులు హైకోర్టుకు వెళ్ళారు. అచ్చెన్నకు మెరుగైన వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలని ఇప్పటికే ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: