ఆంధ్రప్రదేశ్ లో సిఎం గా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే... తీసుకున్న సంచలన నిర్ణయాల్లో స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ సంస్థల్లో స్థానిక యువతకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి అని. ఇప్పుడు అదే పద్దతిని చాలా రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి.కర్ణాటక ఆ విధంగా అడుగులు వేయగా మహారాష్ట్ర కూడా అదే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వచ్చాయి. 

 

ఇక ఇప్పుడు చిన్న రాష్ట్రం అయిన  హర్యానా కూడా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది. హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా ఈ రోజు రాష్ట్ర మంత్రి వర్గం ముందు రాష్ట్రంలోని యువత కోసం ప్రైవేట్ ఉద్యోగాల్లో 75% రిజర్వేషన్లను ప్రతిపాదించే ముసాయిదా ఆర్డినెన్స్‌ను సమర్పించారని అక్కడి మీడియా వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: