గతంలో సిఎం జగన్... మాదిరి సంక్షేమాల షెడ్యూల్ ఇచ్చిన సీఎంలను గతంలో ఎప్పుడు చుసిందిలేదని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ఆయన రాయచోటి లో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ... ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమం కోసం పేదలంతా కళ్ళల్లో వత్తులు వేసుకోని ఎదురు చూస్తున్నట్టు వివరించారు. 

 

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తలపెట్టిన అన్ని అభివృద్ది కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డుపడుతున్నదని ఆయన ఆరోపణలు చేసారు. పేద ప్రజల సామాజిక, సంక్షేమ అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదని ఆయన తీవ్ర విమర్శలు చేసారు. పేదవారు ఇంగ్లీష్‌లో చదవకుడదా అని ఆయన ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. సంక్షేమం అభివృద్ధి సిఎం జగన్ కు రెండు కళ్ళు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: