ఏపీలో కరోనా మహమ్మారి అడ్డు అదుపు లేకుండా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందే తప్ప, నియంత్రణలోకి రావడంలేదు. తాజాగా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారితో కలుపుకుని 1322 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇన్ని కేసులు రావడం ఇదే ప్రథమం. ఏపిలో గత కొన్ని రోజులుగా కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ఇక్కడ కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. నిన్నటి వరకు 18 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

 

అయితే, గడిచిన 24 గంటల్లో ఏపీలో 1322 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20019కి చేరింది. ఇందులో 10860 కేసులు యాక్టివ్ గా ఉండగా, 8920 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా వలన 7 మంది మృతి చెందారు.

 

దీంతో ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 239కి చేరింది. నమోదైన 1322 కేసుల్లో 1265 కేసులు ఆంధ్రప్రదేశ్ కు చెందినవి కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 56 మందికి, ఇతర దేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా సోకింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: