తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి 1,500కు పైగా కేసులు నమోదవుతున్నాయి. నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,831 కొత్త కేసులు నమోదు కాగా 11 మంది మృతి చెందారు. 
 
దీంతో కరోనా కేసుల సంఖ్య 25,733కు చేరగా మృతుల సంఖ్య 306కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10,644 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 14,781 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో 1419 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను నియంత్రించడం సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: